న్యూయార్క్ లోని ఎడిసన్ టౌన్ షిప్ సారథ్యంలో దీపావళి వేడుకలు
న్యూయార్క్ లోని ఎడిసన్ టౌన్ షిప్ సారథ్యంలో పాపాయాని పార్క్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో వారి వారి కుటుంబీకులతో సహా హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ దీపావళి వేడుకలు జరిగాయి. హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను ఇతర సమాజాలకు చాటడానికి ఈ కార్యక్రమం బాగా ఉపకరించింది.
పటేల్ బ్రదర్స్ స్పాన్సర్ చేసిన డ్రోన్ మరియు బాణసంచా ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ డ్రోన్ ప్రదర్శనలో అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దీపావళి థీమ్‌లతో కూడిన చిత్రాలను ప్రదర్శించారు. సూర్యాస్తమయం తర్వాత బాణసంచాను అందరూ కలిసి కాల్చారు.
ఈ సందర్భంగా సంగీత, నృత్య ప్రదర్శనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆహుతులను విశేషంగా అలరించాయి. దీపావళి వేడుకల సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ బియన శ్రీకాంత ప్రధాన్, ఓటి (DOT) కమిషనర్ ప్రియా జైన్, న్యూయార్క్‌లోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆఫీస్‌కు చెందిన సైమన్ షిన్-వీ చెన్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
సాయి దత్త పీఠం, బాలీవుడ్ క్రూ, సోల్‌ఫుల్ పెర్ఫార్మర్స్, న్యూజెర్సీ బతుకమ్మ గ్రూప్, సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ, రట్జర్స్ యూనివర్శిటీ ఢోల్ ఎఫెక్ట్, సంస్కృత స్కూల్ ఆఫ్ కల్చరల్ డ్యాన్స్, రుద్ర డ్యాన్స్ అకాడమీ, లంబాడా ఫోక్టైల్, అవీష్ జాక్వాల్, అవీష్ జాక్వాల్, ఐయెస్ డ్యాన్స్ తదితరులు తమ ప్రదర్శనలను నిర్వహించారు.







