జాతీయ విద్యా దినోత్సవం & మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు బాధ్యతలు అప్పగించారు. దేశంలో ఐఐటీలను ఏర్పాటు చేసి ఎంతో మంది ఇంజనీర్లుగా తయారయ్యేందుకు అబుల్ కలాం ఆజాద్ పునాది వేశారు.
దేశంలో విద్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన ఘనత అబుల్ కలాం ఆజాద్ సొంతం. అబుల్ కలాం గారి హయాంలోనే ఐటీఐలకు పునాది పడింది. ఆ ఐటీఐలను మనం ఇప్పుడు ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసుకున్నాం. నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సాఫ్ట్ వేర్ రంగంతో పాటు పలు విభాగాల్లో AI తో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది.. కానీ బ్లూ కాలర్ జాబ్స్ ను AI తో చేయలేం. నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్ లో బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు.
గులాంనబీ ఆజాద్ నుంచి షబ్బీర్ అలీ వరకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎన్నో అవకాశాలను ఇచ్చింది. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మైనారిటీ రిజర్వేషన్ ను తొలగిస్తామని బీజేపీ చేవెళ్ల సభలో ప్రకటించింది.. ముందు గుజరాత్ లో తొలగించి చూపించాలని మేం సవాల్ విసిరాం. మైనారిటీల సంక్షేమం మా బాధ్యత..

దేశంలో ఏ రాజకీయ పార్టీకి స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర లేదు.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. పేదలకు, మైనారిటీలకు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పిస్తే… బీజేపీ ఆ ఓట్లను తొలగించాలని చూస్తోంది. 12 ఏళ్లు గడిచినా బీజేపీ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోలేదు. బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..
తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు.. ఢిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోంది. కాంగ్రెస్ కు మాత్రమే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉంది. మైనారిటీ స్కాలర్షిప్ లను తొలగించాలని బీజేపీకి ఏ దేవుడు చెప్పాడు. క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచిన మైనారిటీ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాం. షబ్బీర్ అలీని సలహాదారులుగా నియమించాం..
ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ. సిటీని కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓల్డ్ సిటీలో మెట్రో పనులను వేగవంతం చేశాం. మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. మూసీ నదీ పరీవాహకంలో నైట్ ఏకానమీ. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.. మీ సంక్షేమం కోసం పనిచేస్తుంది. చదువు ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది. పిల్లలను చదివించండి.. నైపుణ్యాన్ని అందించండి..
నిఖత్ జరీన్, సిరాజుద్దీన్ తరహాలో పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించండి. నైపుణ్యం, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది… ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. పిల్లలను చదివించండి.. మీ సోదరుడిగా మీకు అండగా నేను ఉంటా.. మీ సమస్యలను అర్థంచేసుకుని పరిష్కరించే బాధ్యత నాది..







