బాలయ్య గొంతులో మాస్ ధమాకా..!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna) మరోసారి తనదైన మాస్ ఎనర్జీతో ఆడియన్స్ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సక్సెస్ఫుల్ సినిమాల డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు దాదా(Dada) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వెంకట సతీష్ కిలారు(Venkata satish Kilaru) భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, బాలకృష్ణ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది.
ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ దాదా ధమాకా(Dada Dhamaka)ను నవంబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడిస్తూ స్వయంగా బాలకృష్ణ తన గొంతును అందించారని తెలిపారు. తమన్(thaman) సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ లో బాలయ్య గొంతు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా తమన్ రూపొందించిన ఈ సాంగ్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ సాంగ్‌లో బాలకృష్ణతో కలిసి బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ(Nargis Fakri) స్టెప్పులు వేయనున్నారు. ఇద్దరి డ్యాన్స్, బాలయ్య ఎనర్జీ సాంగ్ కు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. మంచు మనోజ్(manchu manoj), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ దాదా ధమాకా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







