కాలిఫోర్నియాలోని వైదిక విద్యా గణపతి దేవాలయంలో ఘనంగా దీపావళి, గోవర్ధన పూజ
కాలిఫోర్నియాలోని వైదిక విద్యా గణపతి సెంటర్ దేవాలయంలో ఘనంగా దీపావళి ఉత్సవాలు, గోవర్ధన పూజ ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.ఇందులో భక్తులు అధిక సంఖ్యలో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటూ, ఆనందంగా గడిపారు. ఈ మూడు రోజుల పాటు దీపావళి ఉత్సవాల సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

అంతేకాకుండా ఎంతో సంప్రదాయంగా వస్తున్న కొన్ని ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా దీపాలను కూడా ఈ మూడు రోజుల పాటు భక్తులు వెలిగించారు. అలాగే రథయాత్రను కూడా నిర్వహించారు. అలాగే స్థానికులు వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో యువత కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

దీంతో పాటు చివరి రోజు లక్ష్మీ కుబేర పూజను కూడా శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. అలాగే చివరి రోజు గోవర్ధన పూజను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రోజు కూడా దేవాలయంలో ప్రత్యేక ప్రసాదాలను నివేదించి, భక్తులకు ప్రసాదంగా ఇచ్చారు. ఈ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా కిడ్స్ దీప పూజ, హారతి నిర్వహించారు.







