హీరోగా ఋష్యా దత్తా.. డాన్ బాస్కో టీజర్‌తోనే హంగామా!
టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్(Radhakrishna Entertainments) నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. నిర్మాత వెంకట్ ఉప్పుటూరి(Venkat upputuri) నిర్మాణంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా డాన్ బాస్కో(Don bosco). ఈ సినిమాతో నిర్మాత నాగవంశీ(naga vamsi) బావమరిది ఋష్యా దత్తా(Rushya Datta) హీరోగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లను ప్రారంభించింది. తాజాగా రిలీజైన టీజర్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ నేపథ్యంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆద్యంతం వినోదభరితంగా సాగనున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది.
స్కూల్ రోజుల్లో ఓ స్పెషల్ బ్యాచ్ స్టూడెంట్స్ తో ఫొటో దిగలేకపోయిన ప్రిన్సిపాల్ పాత్రలో మురళీ శర్మ(Murali sharma) కనిపించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ స్టూడెంట్స్ అందరినీ ఒక చోట చేర్చేందుకు మీర్నా మీనన్(Mirna menon) ప్రయత్నిస్తుంది. అయితే రవి అనే స్టూడెంట్ కు ఇన్విటేషన్ అందలేదని తెలిసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఋష్యా దత్తా పోషించిన రవి పాత్రకు రౌడీయిజం అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. అతడి స్టైలిష్ లుక్, బాడీ లాంగ్వేజ్, విచిత్రమైన ప్రవర్తన టీజర్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. విష్ణు ఓయ్(Vishnu Oi), రాజ్‌కుమార్ కాసిరెడ్డి(Rajkumar kasireddy) తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచారు.
రవి రీయూనియన్‌కు ఎందుకు దూరమయ్యాడు? ప్రిన్సిపాల్ కోపానికి అసలు కారణమేంటి? అనే ఇంట్రెస్టింగ్ అంశాలను టీజర్లో వెల్లడించకుండా చిత్రబృందం ఆసక్తిని కొనసాగించింది. మీర్నా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మౌనిక(mounika), మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శంకర్ గౌరీ(Sankar Gowri) దర్శకత్వం వహిస్తుండగా, శ్రీచరణ్ పాకాల(Sri charan paakala) మ్యూజిక్ అందిస్తున్నారు.







