నవంబర్ 27న భోగి రిలీజ్ కు ప్లాన్స్!
చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) కెరీర్లో తొలిసారిగా పూర్తి భిన్నమైన రస్టిక్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న సినిమా భోగి(Bhogi). సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ సినిమాను నవంబర్ 12న రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ చేశారు. అయితే సెన్సార్ ప్రాసెస్ లో ఎదురైన కొన్ని అడ్డంకుల కారణంగా రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. సెన్సార్ బోర్డు నుంచి సినిమాను రివిజన్ కమిటీకి పంపడంతో ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు చిత్రబృందం ఎదురుచూస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, అన్ని సెన్సార్ సమస్యలు పరిష్కారమైతే నవంబర్ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. రివిజన్ కమిటీ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశముంది. సెన్సార్ క్లియరెన్స్ లభించిన వెంటనే శర్వానంద్‌తో పాటు మేకర్స్ ప్రమోషన్స్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.
అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), డింపుల్ హయతి(Dimple Hayathi) హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. శర్వానంద్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో భోగి ఒకటిగా నిలవనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను కేకే రాధామోహన్(KK Radhamohan) నిర్మిస్తున్నారు. సెన్సార్ సమస్యలు త్వరగా పరిష్కారమై కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ కావాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.







