కుప్పంలో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
కుప్పం బైపాస్ వద్ద నిర్మించనున్న రైతు బజార్‌కు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన కొత్త రైతు బజార్ నిర్మాణం చేపట్టనున్న ప్రభుత్వం
• ఆరు నెలల్లో రైతులు, ప్రజలకు అందుబాటులోకి రానున్న రైతు బజార్
• రైతు బజార్ నిర్మాణ నమూనాను పరిశీలించిన సీఎం చంద్రబాబు
• మల్టీ ఫ్లోర్లతో రైతు బజార్ భవనం నిర్మించాలని సూచించిన సీఎం చంద్రబాబు
• రైతు బజార్లో కూరగాయల షాపులతో పాటు ఇతర దుకాణాల ఏర్పాటుకు వీలుంటుందని సూచన
• కోల్డ్ స్టోరేజీ, వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశం
• కోల్డ్ స్టోరేజీ, రైతు బజార్లకు అవసరమైన విద్యుత్‌ను సోలార్ ఏర్పాటు ద్వారా సమకూర్చుకునేలా ఉండాలన్న ముఖ్యమంత్రి
• రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రైతు బజార్లన్నీ వచ్చే ఉడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు.
• ప్రకృతి సేద్యం చేసే మహిళా రైతులతో ముఖ్యమంత్రి మాటామంతీ.
• ఎంతమంది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారని అడిగి తెలుసుకున్న సీఎం.
.కుప్పం నియోజకవర్గంలో 24 వేలమంది రైతులు…28 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని వివరించిన అధికారులు.
• ప్రతి రైతు సేవా కేంద్రం వారీగా ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించిన సీఎం.








