మలయాళ చిత్ర సీమ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్ డైరెక్టర్
భారత సినీ రంగంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను పుణికి పుచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. మలయాళ చిత్ర సీమ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ రూపుదిద్దుకుని ఇండియన్ ఫిలిం సర్కిల్ లో ఎప్పటికప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి .అటువంటి వైవిధ్యమైన చిత్ర పరిశ్రమ లోకి మన తెలుగు డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
తెలుగులో “ఫోకస్” కన్నడం లో “కృష్ణ నీ బాగానే బారో ” తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సూర్య తేజ తాజాగా మలయాళ సినీ రంగంలో ఎంట్రి ఇవ్వ బోతున్నారు. ఒక స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. అతి త్వరలో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ మూవీ పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.








