శర్వా కెరీర్లో మరో భారీ అడుగు!
టాలీవుడ్లో కథల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని చూపిస్తున్న హీరో శర్వానంద్(Sharwanand).. వరుస ప్రాజెక్టులతో తన కెరీర్‌ను ఆసక్తికరంగా మలుచుకుంటున్నారు. ఇప్పటికే భోగి సినిమాను పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం శ్రీను వైట్ల(srinu vaitla) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్(goerge Krish) పై ఫోకస్ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా, 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే శర్వానంద్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాగబంధం(naga bandham) ఫేమ్ అభిషేక్ నామా(Abhishek Nama) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
శర్వానంద్‌తో అభిషేక్ నామా చేయబోయే సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ స్టోరీ కోసం భారీ స్థాయిలో నిర్మాణ ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. ఇప్పటికే హీరోతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ప్రాజెక్ట్ విషయంలో శర్వానంద్ కూడా ఆసక్తి చూపించారని టాక్. అభిషేక్ పిక్చర్స్(Abhishek pictures), ఎన్ఐకే స్టూడియోస్(NIK Studios) బ్యానర్లపై కిషోర్ అన్నపూరెడ్డి(Kishore Annapureddy), నిషిత అన్నపూరెడ్డి(Nishitha annapureddy), అభిషేక్ నామా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌కు శర్వానంద్ కెరీర్లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు సుమారు రూ.10- 12 కోట్ల పరిధిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శర్వానంద్‌కు ఈ సినిమా కోసం ఏకంగా రూ.20 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అంటే ఆయన గత రెమ్యునరేషన్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. భారీ బడ్జెట్, పీరియాడిక్ కథ, క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఈ ఏడాదిలోనే సరైన టైమ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.








