మిస్ కెనడా వరల్డ్ పోటీలో తెలుగు అమ్మాయి
ఖమ్మం జిల్లా అమ్మాయికి కెనడా అందాల పోటీల్లో అరుదైన అవార్డు దక్కింది. మిస్ కెనడా వరల్డ్-2917 అందాల పోటీల్లో పాల్గొన్న కల్యాణపు శ్రావ్యకు పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కింది. ఈ పోటీల్లో 57 మంది పాల్గొన్నారు. ఆన్లైన్లో 5 లక్షలకు పైగా ఓట్లు లభించడంతో శ్రావ్యకు పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కింది. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన కల్యాణపు శ్రావ్య కెనడాలోని ఆల్బెర్టాలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. మిస్ నార్తన్ ఆల్బెర్టా వరల్డ్ టైటిల్ను కైవసం చేసుకున్న శ్రావ్య మిస్ కెనడా వరల్డ్-2017 పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ టైటిల్ సాధించడంతో 24 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శ్రావ్య మిస్ కెనడా వరల్డ్ పోటీల్లో పాల్గొవచ్చు. 1996 మే 14న జన్మించిన శ్రావ్య ఆదిలాబాద్ నగరం లోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివింది. అందాల పోటీల్లో శ్రావ్య అవార్డు సాధిచండం పట్ల బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.








