రైతు నేస్తం ఎడిటర్ కు తానా ఆహ్వానం
అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) నిర్వహిస్తున్న వ్యవసాయ సదస్సుల్లో పాల్గొనేందుకు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్, రైతునేస్తం ఎడిటర్ వై.వెంకటేశ్వరరావుకు ఆహ్వానం అందింది. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకూ జరిగే సదస్సుల్లో వెంకటేశ్వరరావు పాల్గొని ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలతో రైతులకు అందుతున్న ప్రయోజనాలు, రసాయన వ్యవసాయంలో రైతులకు ఎదురవుతున్న ఒడిదొడుకులను వివరించనున్నారు.








