పాకిస్థానీకి సాయం చేయనున్న సుష్మాస్వరాజ్
విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.. ఓ పాకిస్థానీకి సాయం చేసేందుకు అంగీకరించారు. పాకిస్థాన్ లాహోర్కి చెందిన సివిల్ ఇంజినీర్ నెలల పసికందుకి భారత్‌లో చికిత్సకి వీసా వచ్చేలా సాయం చేయాలని ట్విటర్లో కోరాడు. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన సుష్మా..”నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు”అని భరోసా ఇచ్చారు. ముందు పాక్ హైకమిషన్‌ను సంప్రదించండి మీకు మెడికల్ వీసా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.








