అవన్నీ అసత్య ప్రచారాలు… నేను రేసులో లేను
రాష్ట్రపతి రేసులో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సృష్టం చేశారు. పాలక ఎన్డీయే ఇప్పటి వరకూ రాష్ట్రపతి అభ్యర్థి పేరును బయటపెట్టకపోయినా సుష్వా స్వరాజ్తో పాటు పలువురు నేతల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి రేసులో మీరు ఉన్నారా? అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆమె స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలు. నేను విదేశాంగశాఖ మంత్రిని, అంతర్గత వ్యవహారాల గురించి మీరు నన్ను అడుగుతున్నారు అని సుష్మా వ్యాఖ్యానించారు.








