రాష్ట్రపతి రేసులో సుష్మ!
రాష్ట్రపతిగా మరోసారి మహిళకు అవకాశం దక్కుతుందా? కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఈ అత్యున్నత రాజ్యాంగ పదవి వరిస్తుందా? ఢిల్లీ స్థాయిలో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఆమె రేసులో ముందంజలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సుష్మా స్వరాజ్‌కు ప్రతిపక్షాల్లోనూ మంచి పేరుంది. దాదాపు అన్ని పార్టీలు ఆమెకు గౌరవ, మర్యాదలు ఇస్తాయి. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా సుష్మ పేరు ప్రతిపాదించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. పైగా మహిళను అభ్యర్థిగా నిలబెడితే పెద్దగా ఇతర పక్షాలు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.













