త్వరలో ప్రవాసులకు ఓటు
భారతదేశంలో పుట్టి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఓటు హక్కు కల్పించే పనిలో కేంద్రం మరో ముందడుగు వేసింది. ఈ అవకాశం కల్పించడం కోసం రాజ్యాంగ సవరణచేయడానికి తాము సుమఖంగా ఉన్నట్లు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం 15 రోజులలోగా ఇందుకు సంబంధించిన వివరాలన్నీ అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలట్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాలట్ సౌకర్యాలను కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేసిన మేరకు ఈ సౌకర్యాలను సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ రాజ్యాంగ సవరణ జరిగితే ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాస భారతీయులకు తమ స్వదేశంలో ఓటు వేసి, ప్రభుత్వాన్ని ఎక్నుకునే అవకాశం కలుగుతుంది.








