ట్రిపుల్ తలాక్ పై ఆర్నెల్లలో పార్లమెంట్ చట్టం చేయాలి
వివాదాస్పద ఇస్లామిక్ సాంప్రదాయమైన ట్రిపుల్ తలాక్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ముమ్మారు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతి చెల్లదని స్పష్టం చేసింది. ఖురాన్ నియమాలకు తలాక్ వ్యతిరేకంగా ఉందని అభిప్రాయ పడిన ధర్మాసనం, దీనిపై పార్లమెంటులో ఆరు నెలల్లోగా చట్టం తేవాలని ఆదేశించింది. అంతవరకూ తలాక్‌పై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్‌పై చీఫ్ జస్టిస్ ఖేహర్ తీర్పును చదివి వినిపించారు.
ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో న్యాయమూర్తులు కురియన్ జోసఫ్ (క్రైస్తవ), లలిత్ (హందూ), నారిమన్ (పార్శీ)లు ముమ్మారు తలాక్‌ను వ్యతిరేకించారు. ఇస్లాం దేశాల్లోనే దీన్ని నిషేధించినప్పుడు భారత్‌లో ఎందుకు కొనసాగించాలని వీరు ప్రశ్నించారు. పొరుగున ఉన్న పాకిస్తాన్‌తోపాటు, ముస్లిం సంప్రదాయాలను నిక్కచ్చిగా అమలుచేసే సౌదీ వంటి దేశాల్లో తలాఖ్‌పై నిషేధం ఉందని గుర్తుచేశారు.








