ప్రధాని మోదీపై పుస్తకం .. 12న ఆవిష్కరణ
ప్రధాని నరేంద్రమోదీపై సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ సంకలనపరచిన పుస్తకాన్ని ఈ నెల 12న ఆవిష్కరించనున్నారు. ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్ అనే ఈ పుస్తకాన్ని ఆరెస్సెస్ సారధి మోహన్ భగవత్ ఆవిష్కరిస్తారు. సామాన్య నేపథ్యం నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించేదాక సాగిన మోదీ జీవనయానాన్ని ఈ పుస్తకం కళ్లకు కడుతుంది. చక్కటి పోటోలు, కథనాలతో దీనిని తీర్చిదిద్దారు. దేశ ప్రధాని అయిన తర్వాత ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలనూ ఈ పుస్తకంలో పొందుపరిచారు.








