శ్రీకాంత్ కు సీఎం, లోకేష్ అభినందనలు
ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవశం చేసుకున్న తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. పురుషుల సింగల్స్ ఫైనల్ పోరులో తనదైన ఆటతో విజయం సాధించడాన్ని వారు కొనియాడారు. శ్రీకాంత్ మున్నుందు మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.








