విశాఖ-కొలంబోకు అంతర్జాతీయ విమాన సర్వీసు
విశాఖపట్నం నుంచి కొలంబోకు జులై 8వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కానున్నదని టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ ఓరుగంటి నరేష్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వారానికి నాలుగు రోజులు (మంగళ, గురు, శని, ఆదివారాలు) ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన నియో ఎ320 విమానం కొలంబోలో ఉదయం 7:10 గంటలకు బయలుదేరి 9:10 గంటలకు విశాఖ చేరుతుందని, తిరిగి ఇక్కడి నుంచి 10:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు చేరుతుందన్నారు.













