హైదరాబాద్ – విశాఖ మధ్య స్పైస్ జెట్ కొత్త సర్వీసు
హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య మరో విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ రెండు నగరాల మధ్య జూలై 1వ తేదీ నుంచి కొత్త సర్వీసును స్పైస్ జెట్ సంస్థ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. కాగా హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య స్పైస్ జెట్ ఇప్పటికే ఓ సర్వీసును నిర్వహిస్తోంది.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరో సర్వీసు ప్రారంభించే విషయమై ఇటీవలే స్పైస్ జెట్ అధ్యయనం చేసింది. ఆ మేరకు మరో విమానాన్ని కూడా నడపాలని నిర్ణయించింది. ఇది ప్రతిరోజు రాత్రి హైదరాబాద్ 7:20 గంటలకు బయలుదేరి, 8:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నం నుంచి రాత్రి 8:40 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతుంది.








