పుదుచ్చేరి- హైదరాబాద్ మధ్య స్పైస్ జెట్ సేవలు
మూడేళ్ల అనంతరం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి సర్వీసును పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ప్రారంభించారు. ఉడాన్ పథకంలో భాగంగా విమాన సర్వీసులు నడిపేందుకు స్పైస్‌జెట్ ముందుకు వచ్చిందని తెలిపారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్, విజయవాడ నగరాలకు స్పైస్ జెట్ నిత్యం విమానాలను నడపనుంది.








