మెగా మాన్ సూన్ సేల్ ప్రకటించిన స్పైస్ జెట్
లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సేవలందిస్తున్న స్పైస్ జెట్ సంస్థ రూ.699 ఒకవైపు ప్రయాణ టికెట్టును ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. మెగా మాన్ సూన్ సేల్ పేరిట జూలై 4లోగా కొనుగోలు చేసి, ఆపై 14 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 24 లోగా ప్రయాణ తేదీని నిర్ణయించుకోవాలని పేర్కొంది. సంస్థ వెబ్ సైట్, మొబైల్ యాప్, ఎయిర్ పోర్టు కార్యాలయాలు, ఆన్ లైన్ పోర్టల్స్, ట్రావెల్ ఏజెంట్ల నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపింది.








