సూరత్ నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ విమానం
స్పైస్‌జెట్ నాలుగు కొత్త నాన్ స్టాప్ విమాన సర్వీసులను సూరత్ నుంచి వ్యాపార కేంద్రాలైన మెట్రోనగరాలకు నడుపుతున్నట్లు ప్రకటించింది. జులై 10 నుంచి స్పైస్‌జెట్ రోజు వారి డైరెక్ట్ ఫ్లయిట్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. వాటిలో ముంబై-సూరత్ ముంబై సెక్టార్. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఫ్రీక్వెన్సీ పెంచుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్-సూరత్-హైదరాబాద్ సెక్టార్లకు నడుపుతుంది. స్పెస్‌జెట్ రోజు వారి సర్వీసులను నడపడం ఇది రెండవది. కాగా స్పైస్‌జెట్ రోజుకు రెండు విమానాలను నడపడం కేవలం హైదరాబాద్ రూట్లోనే కాగా స్పైస్‌జెట్ డైరెక్ట్ విమానాలను సూరత్ నుంచి నడపుతున్న నగరాలు ఇలా ఉన్నాయి. ఢిలీ, జైపూర్, హైదరాబాద్, కోలకతా, గోవా, ముంబైలున్నాయి.








