”సూపర్ సింగర్” టైటిల్ విన్నర్ ‘స్పందన’
వర్దమాన గాయని స్పందన పుప్పాల మరోసారి తన స్వర మాధుర్యంతో శ్రోతలను ఆకట్టుకుంది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక రియాలిటీ షోలలో టైటిల్ విన్నర్ గా నిలిచిన స్పందన.. మరో టైటిల్ ను సొంతం చేసుకుంది. ”రేడియో సిటీ సూపర్ సింగర్” విజేతగా నిలిచింది స్పందన. లిజనర్స్ ఓటింగ్ ఆదారంగా జరిగిన ఈ పోటిలో ”సూపర్ సింగర్” టైటిల్ స్పందనకు దక్కింది.
ఈ సందర్భంగా స్పందన మాట్లాడుతూ.. ”తనకు ఓట్ చేసి సపోర్ట్ చేసిన ఆడియన్స్ కు , శ్రేయోభిలాషులకు, తనను ఎంతగానో ప్రోత్సహించిన గురువులు శ్రీ రామాచారి గారికి, తన ‘శరత్ జూనియర్ కాలేజీ” ప్రిన్సిపాల్ శరత్ గారికి, మిత్రులకు కృతజ్ఞతలు” తెలిపింది.
ఇప్పటికే పలు సినిమాల్లో హిట్ సాంగ్స్ ఆలపించింది స్పందన. ‘ముసుగు’ సినిమాలో స్పందన పాడిన ”చుంబనం” పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస రెడ్డి ” జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలో స్పందన పాడిన ”ఓ రంగుల చిలుక ‘ పాట రింగ్ టోన్ గా పెట్టుకునేంత పాపులర్ అయ్యింది. ఇప్పటికే ఎంఎం కీరవాణి, సాలూరి వాసు రావు, అనూప్ రెబున్స్ తమన్, సాకేత్ , కమల్ కుమార్, సాయి మధుకర్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుల రికార్డింగ్స్ పాడుతుంది స్పందన. వీటితో పాటు డబ్బింగ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.
స్పందన పాడిన భక్తిగీతాలు కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. క్లాసికల్ లో మంచి పట్టువున్న స్పందన.. గురువులు రామాచారి గారి శిష్యరికంలో సంగీత మెలుకువలు నేర్చుకుంది. బాల్యం నుండి గురువులు రాజసింహ చారి గారు క్లాసికల్ మ్యూజిక్ కి పునాది వేశారు. ప్రస్తుతం గురువులు శ్రీనిధి వద్ద సంప్రాదాయ సంగీతంలో మరింత ప్రావీణ్యం సంపాదిస్తున్న స్పందన.. గురువులు అపూర్వ గజ్జెల వద్ద హిందుస్తానీ సంగీతమునూ నేర్చుకుంది. గురువులు రామాచారిగారితో పాటుగా ప్రముఖ గాయని శోభారాజు బృందంతో కలసి అనేక ప్రదర్శనలు ఇచ్చిన స్పందన.. సాలూరి వాసురావు గారు సంగీత సారధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు రూపొందించిన అన్నమయ్య ”బాల గానామృతం” లో తన గానంను వినిపించింది. ఈ పాటలు ప్రతి రోజు శ్రీవారి కొండపై వినిపిస్తుంటాయి. తిరుమల కొండపై తన పాట వినిపించడం పూర్వజన్మ సుకృతం అని చెబుతూ అనందం వ్యక్తం చేస్తుంది స్పందన.
ఇక స్పందన లేటెస్ట్ గా చేసిన మణిరత్నం- ఏఆర్ రెహ్మాన్ ‘చెలియా” కవర్ అల్బమ్ కి కూడా విశేష స్పందన వచ్చింది. ఇందులో ‘మైమరుపా’ పాటను తనదైన వాయిస్ తో ఆలపించింది స్పందన. యూట్యూబ్ ఆడియన్స్ ను ఈ కవర్ మెస్మరైజ్ చేసింది. ఈ కవర్ ఆల్బమ్ లో స్వయంగా స్పందన అభినయించడం విశేషం.













