ఈ నెల 25న రాహుల్ పట్టాభిషేకం?
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని కూర్చోబెట్టేందుకు దాదాపు తేదీ ఖారారైంది. ఈ నెల 25న పట్టాభిషేకం చేసేందుకు నిర్ణయించినట్లు ఏఐసీసీ వర్గాల విశ్వసనీయ సమాచారం. దీనికోసం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశమైంది. ఈ నెల 10 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుత సమావేశంలో రాహులే అధ్యక్షుడిగా నిర్ణయించినట్లు తెలపడంతోపాటు, పీసీసీ, ఏఐసీసీ నియామకాలకు సోనియా గాంధీకి అధికారం ఇస్తూ తీర్మానం చేసి పంపాలని పీసీసీ అధ్యక్షులకు ఆదేశాలిచ్చారని సమచారం. 7, 8 తేదీల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని సృష్టం చేసినట్లు తెలుస్తోంది.








