దాసరి మృతిపై సోనియా, రాహుల్ సంతాపం
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. సామాజిక అంతరాలను తొలగించేందుకు తన చిత్రాల ద్వారా దాసరి మంచి సందేశాలను ఇచ్చారని సోనియాగాంధీ కొనియాడారు. దాసరి మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ బలమైన నేతను కోల్పోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అతన్ని కోల్పోవడం విచారకరమని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు.








