రైల్వే స్టేషన్లకు సోలార్ పవర్
భారతీయ రైల్వేలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఇప్పటికే అనేకసార్లు కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరిపింది.దేశంలో ముఖ్యమైన పట్టణ, నగరాలకు చెందిన రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భారతీయ రైల్వేలో దాదాపు 1,400 రైల్వే స్టేషన్లు ఉండగా, వీటిలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లకు సోలార్ వెలుగులు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేబోర్డు ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు చెందిన విశాఖ రైల్వే స్టేషన్‌కు సోలార్ పవర్ రానుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. అయితే సోలార్ పవర్‌ను అందించాలంటే ఇది భారీ ప్రాజెక్టు అయినందున టెండర్లను పిలిచి తక్కువ కోట్ చేసే ప్రత్యేక ఏజెన్సీ ద్వారా రైల్వే స్టేషన్లకు సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే నిర్ణయించింది.













