21న హైకోర్టు జడ్జిల ప్రమాణం
ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న కొంగర విజయలక్ష్మి, పి.కేశవరావు, ఎం.గంగారావు, డీవీఎస్ సోమయాజులు, అభినంద్‌కుమార్ షావలి. టి.అమర్నాథ్గౌడ్ పేర్లను గతేడాది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫారసు చేసింది. ఇటీవల కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ వీరి పేర్లను ఆమోదిస్తూ సుప్రీంకోర్టుకు పంపింది. కాగా, వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 16న ఆమోద ముద్ర వేసినట్లు తెలిపింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి 21న ఈ ఆరుగురి చేత ప్రమాణం చేయించనున్నట్లు సమాచారం.








