చైనాను మించిపోయిన భారత్..
చైనా శాస్త్రవేత్త యీ ఫుగ్జియాన్. అధిక జనాభా కలిగిన దేశం చైనా కాదు భారతదేశం అని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారాయన! చైనా జనాభాను భారత్ దాటేసిందని ఆయన గణాంక సహితంగా వివరిస్తున్నారు. గత పాతికేళ్లుగా చైనా గణకులు తమ దేశ జనాభాను ఎక్కువ చేసి లెక్కించారని, వాస్తవానికి అక్కడి జనాభా ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే తక్కువని ఆయన స్పష్టంచేస్తున్నారు. చైనా అనుసరించిన ‘ఒక బిడ్డ విధానం’ వల్ల జనాభా వృద్ధి అక్కడ తగ్గుముఖం పట్టిందని విశ్లేషిస్తున్నారు. యీ ఫుగ్జియాన్ అమెరికాలోని విస్కాన్సిన్-మేడిసన్ విశ్వవిద్యాలయంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.








