చిరంజీవితో బిజెపి మంతనాలు.. టిడిపికి పెద్ద షాక్..!
తెలుగు రెండు రాష్ట్రాలకు సంబందించి ఎలాంటి విషయంలో అయినా వెంకయ్య నాయుడు ఎంతో మమేకమై ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతి అభ్యర్ధి కావడం చేత క్రీయాశీల రాజకీయాల నుండి కాస్త దూరం కావొచ్చని తెలుస్తుంది. ఇక ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలా అన్న సందిగ్ధంలో పడింది భారతీయ జనతా పార్టీ.
అందుకే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి మీద కన్ను పడింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను చూసే పార్టీ జనరల్ సెక్రెటరీ రాజ్ మాధవ్ చిరుతో చర్చలు కూడా జరిపారట. ఏపిలో బిజెపి సోలోగా ఎదగాలంటే గట్టి అండ అవసరం. చిరు కాంగ్రెస్ లో ఉంటున్నా అంతగా ప్రాధాన్యత ఏమి లేదు. అందుకే చిరుని తమ పార్టీలో చేర్చుకునే ఆలోచనలో ఉందట బిజెపి.
ఈసారి తెలుగు దేశంతో పొత్తు కూడా కష్టమే అన్న సంకేతాలొస్తున్నాయి. అందుకే చిరుని ఆహ్వానించి అక్కడ పెద్ద సంచలనమే సృష్టించాలని చూస్తున్నారు. అంతేకాదు చిరు రాకతో కాపు వర్గం కూడా బిజెపికి అనుకూలంగా మారే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై చిరు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అంతకుముందు చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మరి మారుతున్న ఏపి రాజకీయ సమీకరణాలలో ఎవరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరు ఎదురుచూస్తున్నారు.








