తమిళనాడు సీఎంకు సుప్రీం షాక్!
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు నగదు, బంగారం ఎరవేశారన్న వ్యవహారాన్ని పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. పళనిస్వామికి మద్దతు ఇవ్వాలంటూ శశికళ వర్గం ఎమ్మెల్యేలకు భారీఎత్తున నగదు, బంగారం ఎవరేసినట్టు ఓ ఆంగ్ల చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో బయపటడింది. అప్పటి బలపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో పళనిస్వామి గెలిచిన విషయం తెలిసిందే.








