తెలంగాణకు శంకరమూర్తి, ఏపీకి ఆనందీబెన్!
తెలుగు రాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను నరసింహన్ ఒక్కరే చూసుకుంటున్నారు. కేంత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. తెలంగాణకు కర్ణాటకకు చెందిన శంకరమూర్తి, ఆంధ్రప్రదేశ్‌కు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ను నియమించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల పాలన వేర్వేరు రాజధానుల నుంచి జరుగుతున్నందున ఇద్దరు గవర్నర్లు అవసరమని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీ విభజన చట్టంలో పదేళ్లపాటు ఉభయ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండాలని పేర్కొనలేదని, గరిష్టంగా పదేళ్లని పదేళ్లని మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అధికారం కేంద్రానికి ఉంటుందని విశ్లేషించారు. ఈ పార్లమెంటు సమావేశాల తర్వాత కేంద్రం గవర్నర్ల నియామకాలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు.








