ఎస్బీఐ వసూలు చేసే ఛార్జీలివే
న్యూదిల్లీ: నేటి నుంచి దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ ఛార్జీల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఏటీఎం నగదు విత్‌డ్రాలు, ఆన్లైన్ లావాదేవీలు, చెక్‌బుక్‌ల జారీలు వంటి సేవల రుసుములు మారాయి. ఈ నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ మొబైల్ వ్యాలెట్ బ్యాలెన్స్‌ను ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకుంటే రూ.25 ఛార్జీ వసూలు చేయనుంది. వీటితోపాటు బ్యాంకుల బ్రాంచిలు, ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసినప్పుడు కూడా ఎస్బీఐ ఛార్జిలు విధించనుంది. నెలలో తొలి నాలుగు బ్యాంక్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత నుంచి జరిపే ప్రతీ బ్యాంకు లావాదేవికి రూ.50 సేవా పన్నును.. ఇక ఎస్బీఐ ఏటీఎం కార్డు వినియోగదారులకు తొలి నాలుగు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత నుంచి ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి డ్రా చేస్తే రూ.20, ఎస్బీఐ ఏటీఎం నుంచి డ్రా చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంది.
చిరిగిన, దెబ్బతిన్న నోట్లను బ్యాంకులో మార్చే సమయంలో విధించే ఛార్జీల్లో కూడా మార్పులు చేసింది. 20 నోట్లు పైబడి రూ.5000 కంటే ఎక్కువ విలువ ఉన్న నోట్లను మార్చేటప్పుడు ఛార్జీలు విధించనున్నారు. ఇరవై నోట్లకు పైబడి ఉన్న ప్రతినోటుకు రూ.2 చొప్పున లేకపోతే ప్రతీ రూ.1000కు రూ.5 + సర్వీస్ ట్యాక్స్‌ల్లో ఏదీ ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు.
బ్యాంకు ప్రాథమిక సేవలకు..
చెక్‌బుక్ జారీకి ఇలా..: 10 చెక్కులు ఉన్న పుస్తకానికి రూ.30+ సర్వీసు ట్యాక్స్
25 చెక్కులు ఉన్న పుస్తకానికి రూ.75+సర్వీస్ ట్యాక్స్
50 చెక్కులు ఉన్న పుస్తకానికి రూ150+ సర్వీసు ట్యాక్స్
ఏటీఎం కార్డు జారీకి ఇలా..: రూపే క్లాసిక్ కార్డు మాత్రమే ఉచితంగా అందజేస్తారు.
ఆన్లైన్ సర్వీసులకు…
ఆన్లైన్ సర్వీసులకు కూడా ఛార్జీలు విధించనుంది. సత్వర చెల్లింపు సేవ, యూనిఫైడ్ పేమెంట్ ట్రాన్స్ఫర్, ఐయూఎస్ఎస్డీ లావాదేవీలకు రూ.లక్ష వరకూ రూ.5 చొప్పున, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రూ.15 రూపాయలు, రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు రూ.25 ఛార్జి చేస్తారు.
* వ్యాలెట్‌లోని బ్యాలెన్స్‌ను ఏటీఎం నుంచి డ్రా చేసుకుంటే రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.








