మరోసారి ఎస్ బీఐ తగ్గింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది. ఇటీవల వివిధ మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించేసిన ఎస్బీఐ ఇపుడు మరోసారి పొదుపు ఖాతాల డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. పొదుపు ఖాతాల వడ్డీరేటును 0.5 శాతం (50 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది. ఇవాళ్టి (జులై 31) నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.








