అమెరికా దారిలోనే పయనిస్తున్న సౌదీ
విదేశీ ఉద్యోగుల విషయంలో సౌదీ అరేబియా కూడా అమెరికా బాటలో పయనించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విదేశీ కార్మికులపై నిబంధనలు కఠినతరం చేసి, సౌదీ పౌరులకు ఉద్యోగాలు దక్కే ప్రయత్నాలు మొదలెట్టింది. సౌదీ ప్రజల్లో నిరుద్యోగ సమస్య తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ కార్మికుల విషయంలో నిబంధనలు మరింత పెంచాలని, సౌదీ పౌరులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలంటూ అక్కడి కంపెనీలపై ఒత్తితి తీసుకురాన్నుట్లు తెలుస్తోంది. సౌదీలో తక్కువ వేతనాలకు నిర్మాణ రంగంలో, ఇతరత్రా చిన్న చిన్న పనుల్లో లక్షలాది మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. భారతీయులు, తెలుగురాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సౌదీకి ఉద్యోగాల నిమిత్తం వెళుతుంటారు. విదేశీ కార్మికుల విషయంలో సౌదీ కొత్త నియమ, నిబంధనలు అమల్లోకి వస్తే వీరిపై తీవ్ర ప్రభావం పడుతుంది.













