తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
ఓనమ్ పండుగ సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని ఈ శనివారం సాయంత్రం తెరవనున్నారు. ఆ రోజున ముఖ్య అర్చకుడు టీఎం ఉన్నికృష్ణన్ నంబూద్రి ఆలయాన్ని సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. అయితే ఆలయంలో పూజలు మాత్రం ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్వరారు మోహనారు నిర్వహిస్తారు. ఆదివారం రోజున అష్టద్రవ్య గణపతి హోమాన్ని చేపట్టనున్నారు. కళాభిషేకం, ఉదయస్తమానపూజ, పుష్పాభిషేకం, పడిపూజ లాంటి ప్రధాన పూజలను కూడా ఆదివారమే నిర్వహించనున్నారు. మళ్లీ సెప్టెంబర్ 8న ఆలయాన్ని మూసివేస్తారు.








