మా దేశంలో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తాం!
తమ చట్టాలను అతిక్రమిస్తే 2018లో తమ దేశంలో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తామని రష్యా చెందిన టెలికాం సంస్థ అధిపతి అలెగ్జాండర్ ఝురోవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫేస్బుక్ మా చట్టాలను అనుసరించేలా పనిచేస్తాం. 2018లో కచ్చితంగా ఇది జరుగుతుంది అని అన్నారు. విదేశీ మెసేజింగ్ సర్వీసులు, సెర్చ్ ఇంజన్లు, సామాజిక మాధ్యమాల వెబ్సైట్లు రష్యన్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి కావాల్సిన విధివిధానాలను పేర్కొంటూ 2014లో ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఆ దేశస్థుల అన్ని విషయాలను రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలి. ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాలు వినియోగదారుల సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండానే తీసుకుంటున్నారని ఈ సర్వీసులను అక్కడి టెలికం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఫేస్బుక్ తగిన నివారణ చర్యలు తీసుకోకుంటే లింక్డ్ఇన్ మాదిరిగానే రష్యాలో నిషేధిస్తామని అన్నారు.













