సాహసవీరుడికి సీఎం ఇచ్చే రివార్డు ఇంతేనా
ప్రాణాలకు తెగించి 400 మంది విద్యార్థులను కాపాడిన హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్పటేల్ను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘనంగా సన్మానించారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభిషేక్పటేల్కు సీఎం చౌహాన్ రూ.50 వేలు రివార్డు అందజేశారు. హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్ పటేల్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని సీఎం చౌహాన్ అన్నారు. చిటోరా గ్రామంలోని ఓ స్కూల్లో బాంబు ఉన్నట్లు గుర్తించిన అభిషేక్ పటేల్..10 కిలోల బరువున్న బాంబును పట్టుకుని పరుగెత్తుకెళ్లి కిలోమీటర్ దూరంలో పడేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే 400 మందిని కాపాడిన సాహసవీరుడుకి ఇచ్చే రివార్డు ఇంతేనా అంటూ ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. క్రికెట్ లోనో..టెన్నిస్ లోనే గెలిస్తే కోట్లకు కోట్లూ..అవార్డులు, రివార్డులు ఇచ్చే ప్రభుత్వాలు.. 400 మంది చిన్నారులను కాపాడితే మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ట్వీట్లు విసురుతున్నారు.








