టీమిండియా కోచ్గా రవిశాస్త్రి నియామకం
టీమిండియా ప్రధాన కోచ్ ఎవరో బీసీసీఐ తేల్చేసింది. అనిల్ కుంబ్లే వారసుడిగా రవిశాస్త్రిని ప్రకటించింది. టీమిండియా కెఫ్టెన్ కోహ్లీ కోరిన వ్యక్తినే జట్టుకు కోచ్గా నియమించింది. గతంలో టీమిండియా డైరెక్టర్గా పనిచేసిన రవిశాస్త్రికే క్రికెట్ సలహా మండలి ఓటేసింది. ఆయనను కోచ్గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.








