రంజాన్ సందర్భంగా భారత ఖైదీలకు విముక్తి
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భారత్కు ఖతర్ తీపికబురు అందజేసింది. తమ దేశంలోని జైలులో మగ్గుతున్న 42మంది భారతీయులకు ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించింది. ఈ మేరకు ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ ఉత్తర్వులు జారీచేసినట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే భారతీయ ఖైదీల్లో ఎవరెవరు విడుదలయ్యారనే దానిపై మాత్రం ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు.








