ఎయిర్‌హోస్టెస్‌గా రాష్ట్రపతి కుమార్తె
ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగిగా కొనసాగుతానని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో తన విద్యాభ్యాసం జరిగిందని, ఆ తరువాత కళాశాల విద్య లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తయిందని తెలిపారు. తన తండ్రి చాలా కష్టపడి పని చేసేవారని అన్నారు. ఆ కష్టమే ఆయనను నేడు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆమె అన్నారు.








