రాష్ట్రపతి, ప్రధానికి తిరుమల పుస్తకం
తిరుమల విశిష్ఠత, శ్రీ వేంకటేశ్వరస్వామిపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తాను రాసిన పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్రమోడీకి అందజేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి, ప్రధానిలను కలిసిన రమణ దీక్షితులు తాను రచించిన పుస్తకాన్ని వారికి అందించారు. తిరుమల విశిష్ఠత, వేంకటేశ్వరాస్వామిపై మహర్షులు చెప్పిన విషయాలు, స్వామికి ప్రతిరోజు అందించే నైవేద్యం, ప్రసాదాల ప్రాముఖ్యత వివరిస్తూ రమణ దీక్షితులు ఒక పుస్తకాన్ని రచించారు.








