నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్
నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. అర్వింద్ పనగరియా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తాను తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెళ్లిపోతున్నానని ఈ నెల 1న పనగరియా ప్రకటించినది తెలిసిందే. 31న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారు. దీంతో ఈయన స్థానంలో రాజీవ్ కుమార్‌ను కేంద్రం నియమించింది. కాగా, నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా డాక్టర్ వినోద్ పాల్‌ను కేంద్రం తీసుకుంది.








