బీజేపీ సీఎం అభ్యర్థిగా రజనీ!
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని, బీజేపీలో చేరితే మరింత ఆనందమని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ సందిగ్ధత ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలను కోవడం మంచి నిర్ణయమన్నారు. రజనీకాంత్ ప్రముఖ నాయకుడని, విశేష ప్రజాదరణ ఉందని అన్నారు. బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో అనుమానమేలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే అంతిమంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.








