నిన్న రజినీ రాజకీయాల్లోకి వద్దని.. నేడు రావాలని ఆందోళన
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి ఎదుట ఆయన ఫ్యాన్స్ సందడి నెలకొంది. నిన్న నిరసన గళాలు వినిపిస్తే, నేడు రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు వినిపించాయి. రజనీని రాజకీయాల్లోకి రావొద్దంటూ తమిళ సంఘాలు నిరసన తెలపడంతో రజనీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. వాషర్మాన్పేటలో రజనీ మద్దతుదారులు ప్లాకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. తమిళ సంఘాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రజినీ రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేశారు. తలైవాపై నిరసన తెలిపే వారిని ఏం చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు చెన్నైలోని రజనీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.








