బస్సు కండక్టర్ సీఎం అవుతారు
కర్ణాటకలో బస్సు కండకర్ట్‌గా పని చేసి తమిళ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్ తప్పకుండా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన చిన్ననాటి మిత్రుడు రాజబహదూర్ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజబహదూర్ రజనీతో ఉన్న స్నేహం గురించి, ఆయన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. జయలలిత మరణం అనంతరం తమిళనాడు పరిస్థితులపై రజనీ అధ్యయనం చేశారని, ఆరోగ్యవంతమైన రాజకీయాలు రావాలని ఆయన ఆశిస్తున్నారన్నారు.








