ఇండియాలో ఓ గ్రామానికి డొనాల్డ్ ట్రంప్ పేరు!
భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు తనవంతు కృషిచేస్తున్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పతక్. ఇందులో భాగంగానే భారత్లోని ఓ గ్రామానికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. వాషింగ్టన్లోని ఓ కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొన్న బిందేశ్వర్ భారత్లోని ఓ గ్రామానికి ట్రంప్ పేరు పెడుతున్నాం అని ప్రకటించారు. రాజస్థాన్లోని మేవాట్ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలిపారు. అంతేగాక, స్వచ్ఛభారత్ కోసం తాము నిరంతరం శ్రమిస్తున్నామని బిందేశ్వర్ తెలిపారు. ఇందుకు అమెరికాలోని భారతీయులు కూడా తమవంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ వ్యక్తులతో పాలు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.








