వేటాడండి …వేధించండి
బికనీర్ భూ కుంభకోణంపై రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును కోరిందన్న వార్తలపై సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వధేరా స్పందించారు. ఆ కుంభకోణంలో రాబర్ట్ వధేరా ప్రమేయంపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తు వార్తలపై స్పందిస్తూ రాబర్ట్ వాధ్రా సీబీఐ నన్న వేటాడినా, వేధించినా ఒరిగేదేమీ ఉండదనీ, ఆ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని అన్నారు.








