త్వరలోనే రాహుల్‌కు బాధ్యతలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని త్వరలోనే ఎన్నుకుంటామని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రకటించారు. త్వరలోనే పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించి, రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా జరుగుతదని అన్నారు. రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటే ఇటు పార్టీకి, అటు దేశానికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. రాహుల్‌కు పదోన్నతి కల్పించకపోవడంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. రాహుల్‌ను అధ్యక్షుడిని చేసి, త్వరలోనే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతామని సృష్టం చేశారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అన్నారు.













