రాహుల్ గాంధీ కనిపించడం లేదు…
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ కనపించడం లేదంటూ అమేథీలో పోస్టర్లు వెలిశాయి. గౌరవనీయులైన అమేథీ పార్లమెంటేరియన్ అమేథి నుంచి అదృశ్యమయ్యారని పోస్టర్లలో రాసి ఉంది. సామాన్య వ్యక్తి కూడా రాహుల్ ప్రవర్తనపై విసుగు చెందుతున్నట్టు పోస్టర్లలో రాసి ఉంచారు. రాహుల్ ఎవరికైనా కనిపించిన యెడల చెబితే, వారికి రికార్డు కూడా ఇస్తామని పోస్టర్లు వెలిశాయి. రాహుల్ కనిపించడం లేదు అని వెలిసిన పోస్టర్లపై స్థానిక కాంగ్రెస్ నేత యోగేంద్ర మిశ్రా స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిగట్టుకుని రాహుల్పై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోస్టర్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేత ఉమా శంకర్ పాండే సృష్టం చేశారు. మిశ్రా వ్యాఖ్యలను పాండే ఖండించారు.








